అభివృద్ధే తుమ్మల నైజం.. ప్రజలే ఆయన బలం
ఎమ్మెల్యే రాగమయి
సత్తుపల్లి, మే8 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన రాజకీయ ఘట్టానికి 40 సంవత్సరాలు పూర్తి కావడంతో, స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మాట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుమ్మల యుగంధర్ హాజరైనారు. ముందుగా కేక్ కట్ చేసి ఆయనకు రాజకీయ అభినందనలు తెలియజేశారు.
అనంతరం తుమ్మల యుగంధర్, మట్టా దయానంద్, ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వర్గీయ ఎన్టీ రామారావు టైం లో మంత్రిగా ప్రమాణం చేసి, రాజకీయం ప్రస్థానం ప్రారంభించిన ఆయన మంత్రి పదవిగా ప్రమాణం చేసిన నాటి నుండి అభివృద్ధి ఆయన నినాదంగా,ప్రజలే ఆయన బలంగా పనిచేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా ఆయన అభివృద్ధి మాత్రమే కనపడేది అని, ప్రజల కోసం ఏమి చేస్తే బాగుంటది అనే ధోరణిలో మాత్రమే ఆలోచించేవారని అన్నారు.
బుగ్గపాడు ఫుడ్ పార్క్,వేంసూర్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వస్తుంది అంటే ఆయన పుణ్యమేనని అన్నారు. ఎక్కడ అభివృద్ధి చూసినా ఆయన శిలాఫలకాలే కనిపిస్తాయని, ఆనాడు జలగం వెంగళరావు ఎలా అభివృద్ధి చేశారు,అదే ధోరణి లో మంత్రి తుమ్మల అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.
ఇంకా ముందు ముందు ప్రజలకు మరింత సేవలు చేసేందుకు భగవంతుడు ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని కలుగజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నికి మున్సిపల్ చైర్ పర్సన్ రెహానా కమల్, వైస్ చైర్పర్సన్ బొంతు సుమలత, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, ఐదు మండలాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మహిళా యూత్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు,డిసిసి నాయకులు, సత్తుపల్లి నియోజకవర్గ సర్పంచ్ లు, ఉప సర్పంచ్లు,కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు అధికంగా పాల్గొన్నారు.






