వనపర్తికి రూ.2,147 కోట్ల అభివృద్ధి వరం
- 30 నెలల్లో అభివృద్ధి, సంక్షేమానికి భారీ ఊతం..
- 17 వ విడత సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మిషాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
- ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, జూలై 10 (విజయక్రాంతి): వనపర్తి నియోజకవర్గంలో గత 30 నెలల కాలం లో రూ.2,147 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేస్తున్నామని ఎ మ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుం చి ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా కృషి చేస్తోందన్నారు.
శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో నిర్వహించిన 17వ విడత ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్), కల్యా ణలక్ష్మిషాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మే ఘారెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా నిరంతరం పనిచేస్తున్నట్లు తెలిపారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఆరోగ్య సేవల బలోపేతం, మహిళా సంఘాలకు చేయూత వంటి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొ స్తున్నాయని పేర్కొన్నారు. సి ఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లో అభివృద్ధి ముందుకు.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి, భూకబ్జాలు, అధికార దుర్వినియోగం పెరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు.
ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఫోన్ ట్యాపింగ్ వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పాటు సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. రూ.79.89 కోట్ల సంక్షేమ సాయం ...2026 జూలై 10 నాటికి వనపర్తి నియోజకవర్గంలో మొత్తం 13,167 మంది లబ్ధిదారులకు రూ.79.89 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
సీఎంఆర్‌ఎఫ్ కింద 7,371 మందికి రూ.18.05 కోట్లకు పైగా, కల్యాణలక్ష్మిషాదీ ముబారక్ పథకం ద్వారా 5,385 మందికి రూ.53.91 కోట్లకు పైగా, ఎల్‌ఓసీ పథకం ద్వారా 411 మందికి రూ.7.92 కోట్ల వైద్య సహాయం అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






