08-02-2026 03:22:54 PM
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వికారాబాద్ జిల్లాలోని వైరాలో నిర్వహిరించిన ఎన్నికల ప్రచారంలో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాటు పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ కాలనీలు నిర్మించిందన్నారు.
మన నిధులు మనకే ఖర్చు కావాలని పోరాడి తెలంగాణ సాధించుకున్నామని, బీఆర్ఎస్ మాత్రం నిధులను పేదవాళ్ల కోసం ఖర్చు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాకుకు ఉచిత విద్యుత్ ను మొదట అమలు చేసింది కాంగ్రెస్ పార్టీనే అని, ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లు నిర్మిస్తున్నామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఏనాడు నిధులు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.