12 May, 2026 | 3:35 PM

ప్రమాధకరంగా రోడ్డుపై ముళ్ల మొక్కలు

12-05-2026 02:16 PM

ప్రమాదాల బారిన ప్రయాణికులు

చందుర్తి,(విజయక్రాంతి): వేములవాడ నుండి కోరుట్ల ప్రధాన రహదారి మల్యాల గ్రామ శివారులో హరితహారం కింద నాటిన చెట్లు వాహదారులకు అత్యంత ప్రమాదకరంగా మారాయి.ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కన్పించకుండా ద్విచక్ర వాహనాలకు అలాగే బాటసారులకు చాలా వరకు ప్రమాదాలు జరిగాయి. ఈ మొక్కలు చూడటానికి అందంగా ఉన్నా వాటి ముళ్ల వల్ల మాత్రం చాలా ప్రమాదం ఉంది.

గ్రామ ప్రజలు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ప్రమాదకరంగా ఉన్న మొక్కలను తొలిగించకుండా నిర్లక్ష్యం వ్యహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న ముళ్ల మొక్కలను తొలిగించి ప్రయానికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.