08-02-2026 02:27:01 PM
- విజయక్రాంతి దమ్మున్న దినపత్రిక
- మాజీ ఎంపిపి ప్రతాప్ గౌడ్
కొల్లాపూర్ రూరల్: తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని పెద్దకొత్తపల్లి మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ అన్నారు. ఆదివారం కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బరిగేల లక్ష్మి వేణుగోపాల్ యాదవ్‌కు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ తన అనుచరులతో కలిసి విజయక్రాంతి దినపత్రిక నూతన సంవత్సరం-2026 క్యాలెండర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందన్నారు. విజయక్రాంతి దినపత్రిక ప్రజా సమస్యల పరిష్కారం, అవినీతి అక్రమాలను బయటపెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సైతం ప్రజలకు చేరవేయడంలో ముందు వరుసలో ఉందన్నారు. 7వ వార్డు అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి, కొల్లాపూర్ మున్సిపాలిటీలో 7వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.