108లోనే ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం..
31-03-2026 01:11 AM
ఆళ్ళపల్లి, మార్చి 30 (విజయక్రాంతి): మండల పరిధిలోని కిచ్చనపల్లి గ్రామానికి చెందిన నిండు గర్భిణి పాయం ఉమామహేశ్వరికి 108 లోనే ప్రసవించిన ఘటన సోమవారం చోటు చసుకుంది. 108 సిబ్బంది ఈఎంటి పరమ ఆకాష్ పైలెట్ శ్రీహర్ష తెలిపిన వివరాల ప్రకారం కిచ్చెనపల్లి. గ్రామానికి చెందిన పాయం ఉమామహేశ్వరి రాత్రి నుండి పురిటి నొప్పులు ఎక్కువ కాగా 108 వాహనానికి సమాచారం అందించడంతో, ఆళ్లపల్లి 108 సిబ్బంది హుటా హుటిగా వారి ఇంటికి చేరుకొని, మెరుగైన వైద్యం కోసం వాహనంలో ఆళ్లపల్లి హాస్పటల్ కి తరలిస్తుండగా, మార్గ మధ్యలోనే ప్రసవం జరిగిందని తెలిపారు. ఏదేమైనప్పటికీ 108 సిబ్బంది సకాలంలో రావడంతో సుఖ ప్రసవం జరగడం, తల్లి బిడ్డ క్షేమంగా ఉండడం పట్ల భర్త నరేష్ తోపాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.




