7 March, 2026 | 3:19 PM

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ

07-03-2026 01:34 PM

హైదరాబాద్: అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్(Delaware Governor Matt Meyer) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు, డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. డెలావర్ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న గృహ నిర్మాణం, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల గురించి గవర్నర్ మాట్ మేయర్ రేవంత్ రెడ్డికి వివరించారు.

భవిష్యత్తులో తెలంగాణ, డెలావర్ రాష్ట్రాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగాలని మాట్ మేయర్ ఆకాంక్షించారు. తెలంగాణ ప్రతినిధుల బృందంతో డెలావర్ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ డెలావర్ గవర్నర్ కి 'తెలంగాణ-2047' విజన్(Telangana-Rising-2047) డాక్యుమెంట్ ను అందజేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu), డెలావర్ ఫస్ట్ లేడీ లారెన్ మేయర్, వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.