27 April, 2026 | 4:17 AM

హాస్టల్లో ఉరేసుకొని డిగ్రీ విద్యార్థి మృతి

27-04-2026 02:20 AM

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు

మహబూబాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూర్ గ్రామ పరిధిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న రాచర్ల కార్తీక్ (20) ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి. కార్తీక్ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గదిలోనే టవల్‌తో ఉరేసుకొని చనిపోయినట్లు తొర్రూర్ ఎస్‌ఐ ఉపేందర్ తెలిపారు.

కార్తీక్ మరణవార్తను తల్లిదండ్రులకు సమాచారం అందించగా, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కార్తీక్‌కు గణితశాస్త్రం చదవడం ఇష్టం లేక, సోమవారం ఉదయం లెక్కల పరీక్ష ఉండడంతో మనస్థాపంతో ఉరివేసుకొని ఉంటాడని తండ్రి దేవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.