12 April, 2026 | 6:39 PM

ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం: నల్లమోతు భాస్కరరావు

12-04-2026 04:45 PM

వేములపల్లి,(విజయక్రాంతి): ప్రతి కార్యకర్త కుటుంబానికి ఎల్లప్పుడూ బిఆర్ఎస్ పార్టీ పార్టీ నాయకులు అండదండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నాగవల్లి శంకర్ తల్లి అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదేవిధంగా దైద జాన్సన్ పుట్టల కిషోర్ వల్లపు దాసు కిరణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాల బారిన పడడంతో వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.

అనంతరం శెట్టిపాలెం గ్రామంలోని మజ్జిగపు వెంకట్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా మచ్చ లచ్చయ్య మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట  సర్పంచులు పుట్టల సందీప్, సైదులు టిఆర్ఎస్ నాయకులు కట్ట మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు