12 April, 2026 | 6:41 PM

కురుమ సంఘం అధ్యక్షుడిగా చిన్నం యాదగిరి ఎన్నిక

12-04-2026 04:47 PM

ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు కురుమ సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం  నిర్వహించగా, అధ్యక్షుడిగా చిన్నం యాదగిరి ఎన్నికయ్యారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, మాజీ కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గిడి శ్రీశైలంపై విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆలేరు కురుమ సంఘం తరపున నూతనంగా ఎన్నికైన చిన్నం యాదగిరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

నూతన కమిటీ ఉపాధ్యక్షులుగా జూకంటి ఐలయ్య, పేరపు సిద్దులు, మైల వెంకటేష్, కొన్నె మల్లేష్, ఇక్కిర్రి శ్రీనివాస్, జూకంటి వెంకటేష్, పత్తి వెంకటేష్, జల్లి నర్సింహులు, మల్లెల శ్రీకాంత్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద కురుమ ఎగ్గిడి శ్రీనివాస్, చిమ్మి అబ్బసాయిలు, బల్దే రాములు, మంగ నర్సింహులు, బుడిగే సిద్దులు, ఎగ్గిడి యాదగిరి, జెట్టా సిద్దులు, ఎగ్గిడి బాలరాజు , అలాగే సంఘ సభ్యులు తదితరులు  పాల్గొన్నారు.