20 May, 2026 | 2:43 AM

పట్టుదలతో ఏదైనా సాధ్యమేనని చెప్పే చిత్రమే ‘దీక్ష’

20-05-2026 01:18 AM

ఆర్‌కే ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై ప్రతా ని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘దీక్ష’. ఈ చిత్రంలో కిరణ్ హీరోగా నటించగా.. ఢీ, జోడీ ఫేమ్ అక్సాఖాన్, అలేఖ్యరెడ్డి హీరోయిన్లుగా కనిపించనున్నారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్‌శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 12న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో పలు రంగాల ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కిరణ్ మాట్లాడుతూ.. “రామకృష్ణ గౌడ్ ఎంతోమంది కొత్తవారికి అవకాశాలిస్తున్నారు. దీక్ష, పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలమని చెప్పే చిత్రమిది” అన్నారు. ‘మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రమిది.

ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా చేశాన’ని హీరోయిన్ అక్సాఖాన్ తెలిపారు. దర్శక నిర్మాత రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. “ప్రతి మనిషిలో దీక్ష, పట్టుదల ఉంటాయి. వాటితో పనిచేస్తే ఏదైనా సాధించగలం అని చెప్పే చిత్రమిది. జూన్ 12న విడుదల కానున్న ‘ఆర్కే దీక్ష’ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలి” అని అన్నారు.