15 April, 2026 | 2:58 AM

బీసీ మహిళలకు సబ్ కోటా కోసం దీక్ష

15-04-2026 12:13 AM

ముషీరాబాద్,ఏప్రిల్ 14(విజయక్రాంతి): మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీసీ మహిళా జేఏసీ ఛైర్మన్ మట్టా జయంతి గౌడ్ మంగళవారం హిమాయత్ నగర్ లోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జయంతి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజునే ఆమరణ నిరాహార దీక్ష పూనుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఢిల్లీ వేదికగా పలుమార్లు ధర్నాలు చేపట్టినట్టు ఆమె తెలిపారు. కాగా కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమరణ నిరాహార దీక్ష చేయాల ని నిర్ణయం తీసుకున్నట్లు జయంతి వెల్లడించారు. బీసీ మహిళలకు ఉప కోటా కల్పించ కపోవడం అంటే మెజారిటీ ప్రజలను మోసం చేయటమే అని ఆమె అభిప్రాయ పడ్డారు.

అన్ని వర్గాలకు మేలు చేసినప్పుడే అసలైన సామాజిక న్యాయం అన్నారు. నిరాహార దీక్షకు జాతీయ ఓబీసీ ఇంటెలెక్చ్యువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, ఏఐబీసీఎస్‌ఏ నేత కిరణ్ కుమార్, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్, బీసీ మేధావులు, బీసీ సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు.