22 April, 2026 | 12:03 PM

Breaking News

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •  

నాగర్‌కర్నూల్‌లో ఘనంగా దీక్షా దివస్‌

29-11-2025 08:13 PM

నాగర్‌కర్నూల్‌ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని జరిపారు. మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, నాయకులు నాగం శశిధర్ రెడ్డి, బైకని శ్రీనివాస్ యాదవ్, ఉద్యమకారులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహాలకు, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. కేసీఆర్ చిత్రపటానికి పూలాభిషేకం చేపట్టారు. ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం మళ్లీ జ్వాలలు రగిలిందన్నారు. ప్రజల పోరాటం, విద్యార్థుల త్యాగాలతో కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. కేసీఆర్ త్యాగం, పోరాట పటిమ వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు. ఉద్యమ జ్ఞాపకాలు, స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నిలవాలని పిలుపునిచ్చారు.