22 April, 2026 | 12:36 PM

Breaking News

పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు

22-04-2026 10:44 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్(Kaleshwaram Lift Irrigation Project) నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను(Justice PC Ghose Commission Report) ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సీజే ధర్మాసనం నేడు తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. పీసీ ఘోష్ కమిషన్ రద్దు చేయాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, స్మితా సబర్వాల్, ఎస్ కే జోషీ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా, సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.