22 April, 2026 | 1:29 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

విద్యార్థుల చదువుకు ఆటకం లేకుండా చర్యలు తీసుకోండి

29-11-2025 08:11 PM

బాధ్యులను కోరిన ఐటిడిఏ పిఓ రాహుల్ 

భద్రాచలం,(విజయ క్రాంతి): గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీలకు వారి ఆరోగ్య పరిరక్షణతో పాటు మెనూ ప్రకారం సమయానుకూలంగా భోజనం అందించి వారి చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడవలసిన బాధ్యత హెచ్ఎం ఉపాధ్యాయులపై ఉందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. శనివారం నాడు దుమ్ముగూడెం మండలంలోని కే రేగుబల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, కే గంగోలు, కొంగ వాగు గుంపు జిపిఎస్ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆశ్రమ పాఠశాలలోని పరిసరాలు, వంటగది సామాన్లు నిలువ చేసే స్టోర్ రూమ్, డార్మెటరీ, డైనింగ్ హాల్, పిల్లలకు వండిన ఆహారాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని లకు చదువుతోపాటు మెనూ ప్రకారం మంచి పౌష్టికరమైన ఆహారం  అందించాలని, ఆశ్రమ పాఠశాలలో వంట చేసే సిబ్బంది పరిశుభ్రతను పాటించాలని, వంట చేసిన తర్వాత విద్యార్థినిలకు సరఫరా చేసేముందు ఉపాధ్యాయులు మరియు పనిచేసే సిబ్బంది తిన్న తర్వాతనే వారికి వడ్డించాలని అన్నారు. విద్యార్థినిలు ఉపాధ్యాయులకు చెప్పకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు బయటకు వెళ్లకూడదని, ఖాళీ సమయాలలో కెరీర్ గైడెన్స్ కి సంబంధించిన చార్టులు పరిశీలించి భవిష్యత్తులో మీరు ఏ రంగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో ఇప్పటినుంచే ప్రిపేర్ కావాలని విద్యార్థినిలకు సూచించారు.

అనంతరం జిపిఎస్ పాఠశాలలను పరిశీలించి ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు పిల్లలు ఏ విధముగా రాస్తున్నది చదువుతున్నది వారి ద్వారా బోర్డుపై రాయించి వాటికి సంబంధించిన పదముల అర్థాలను అడిగి తెలుసుకున్నారు. జిపిఎస్ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికల విద్యాభ్యాసం పునాది నుండి పటిష్టంగా ఉంచడానికి ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టడం జరిగినందున ఉపాధ్యాయులు తప్పనిసరిగా వెనుకబడ్డ పిల్లలను గుర్తించి వారు వర్క్ బుక్ లోని అంశాలు పదములు కూడికలు తీసివేతలు సక్రమంగా చేసేలా తర్ఫీదు ఇవ్వాలని అన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రేగుబల్లి పాఠశాల హెచ్ఎం సావిత్రి, వార్డెన్ పార్వతి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.