15-02-2026 12:00:00 AM
సికింద్రాబాద్, ఫిబ్రవరి14 (విజయ క్రాంతి): లాలాగూడ, మౌలాలి రైల్వే స్టేషన్ల మద్య గల రైల్వే ట్రాక్ ప్రక్కన ఉన్న చిన్న మురుగునీటి కాలువలో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నాడని సమాచారం అం దడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. యువకుడు 20 నుంచి 25 సంవత్సరాల వయసుగల చామ న ఛాయ రంగు కలిగియుండి తెలుపు రంగు పై బూడిద రంగు చెక్స్ షర్ట్, మెరూన్ కలర్ ట్రాక్ ప్యాంట్ ధరించాడు. మృతుడు మద్యం మత్తులో గానీ లేదా గుర్తుతెలియని అనారోగ్య కారణాల వల్ల గాని ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించి ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు లభించలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డిప్యూటీ ఎస్ ఎస్ సమాచారం మేరకు కేసు నమోదు చేశారు.