డెడ్‌లైన్ మరో ఏడాది
- పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
- పాలమూరుతో సాగునీటికి కొత్త ఊపిరి..
- సకాలంలో పూర్తయ్యేలా సమగ్ర ప్రణాళికలు
- సమస్యలన్నీ మిషన్ మోడ్‌లో పరిష్కరించాలి
- పనుల పురోగతిపై ప్రతినెలా సమీక్షిస్తాం
- పనితీరు సరిగా లేని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు
- పాలమూరు రైతుల ఆకాంక్షలు నెరవేర్చేలా చర్యలు తీసుకుంటాం
- నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): పాలమూరులో సాగునీటి రంగానికి కొత్త ఊపిరి పోసే విధంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిచేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ప్రాజెక్టులోని ప్రధాన భాగాల పూర్తి షెడ్యూల్‌ను చీఫ్ ఇంజినీర్లు సమర్పించాలని ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ముమ్మరం చేసింది.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నిర్వహించిన రెండు రోజుల పాలమూరు ప్రాజెక్టుల పర్యటనలో తీసుకున్న నిర్ణయాల అమలుపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి సకాలంలో పనులు పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతిలో అడ్డంకిగా ఉన్న భూసేకరణ, పునరావాసం, విద్యుత్ సరఫరా, కాంట్రాక్టర్ల పనితీరు వం టి అంశాలను మిషన్ మోడ్‌లో పరిష్కరించాలని సూచించారు.
మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి, పంప్‌హౌస్‌ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను పూర్తి చేసి 2027 మార్చి నాటికి అన్ని మోటర్లను పూర్తి స్థాయిలో పనిచేసేలా చేయాలని ఆదేశించారు. నార్లాపూర్ రిజర్వాయర్ కింద కాలువల నిర్మాణాన్ని వేగవంతం చేసి, పంపిణీ వ్యవస్థతో సహా మొత్తం ప్రాజెక్టును 2027 జూ న్ నాటికి పూర్తిచేయాలని సూచించారు.
ప్రభుత్వ ప్రతిష్టాత్మక పాలమూరు--రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై ప్రత్యే కంగా సమీక్షించిన ఉత్తమ్, నార్లాపూర్, ఏదుల, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల వల్ల నిర్వాసితులైన కుటుంబాలకు పునరావాస చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరివేన రిజర్వాయర్ వరకు ప్రధాన మౌలిక సదుపా యాల పనులను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, నార్లాపూర్, ఏదుల, వ ట్టెం పంప్‌హౌస్‌లకు తక్షణమే విద్యుత్ కనెక్టివిటీ కల్పించాలని సూచించారు.
భవిష్య త్ విద్యుత్ వ్యయాలను తగ్గించే లక్ష్యంతో రిజర్వాయర్ల వద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. క్తల్--నారాయణపేట--కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అవసరమైన సుమా రు 2,200 ఎకరాల భూమి సేకరణ ప్రక్రియను 2026 జూలై నాటికి ప్రారంభిం చాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించా రు. ఇప్పటికే రిక్విజిషన్‌లో ఉన్న 4,200 ఎకరాల భూమికి సంబంధించిన భూసేకరణ, పునరావాస ప్రక్రియలను పూర్తి చేసి మొదటి దశ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
రాజీవ్ భీమా ఎత్తిపో తల పథకానికి అవసరమైన మిగిలిన 80 ఎకరాల భూసేకరణను 2026 జూలై నా టికి పూర్తి చేయాలని ఆదేశించారు. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి అవసర మైన మిగిలిన 167 ఎకరాల భూమి సేకరణ ప్రక్రియను పూర్తి చేసి, అన్ని పెండింగ్ పనులను 2027 మార్చి నాటికి ముగించాలని సూచించారు. జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద అదనంగా 58 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన 534 ఎకరాల భూ సేకరణను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.
గూడెం దొడ్డి రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనలను సమీక్షించారు. పంప్‌హౌస్‌ల సమీపంలో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ఆర్డీఎస్- మ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశ పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి, అవ సరమైన 567 ఎకరాల భూమిని రైతుల తో సంప్రదింపులు, పరస్పర అంగీకారం తో సేకరించి వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
ప్రాజెక్టుల పురోగతిని ప్రతి నెలా సమీక్షించి భూసేకరణ, నిధుల అవసరాలు, కాంట్రాక్టర్ల పనితీరు, అమలు స్థితి పై నివేదికలు సమర్పించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. పాలమూరు లో సాగునీటి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పే ర్కొంటూ, పనితీరు సరిగా లేని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు.
2027 నాటికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులలో ఎక్కువ భాగం పూర్తి చేసి, ప్రాంతీయ సాగునీటి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావ డం ద్వారా పాలమూరు రైతుల దశాబ్దాల ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావే శంలో సాగునీటి శాఖ కార్యదర్శి ఈ శ్రీధ ర్, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.






