30 June, 2026 | 3:58 AM

ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

30-06-2026 12:00 AM

నిజాంసాగర్, జూన్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి గ్రామంలో సోమవారం నాడు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ  కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్స్ పంపిణీ చేస్తున్న బీఎల్ఏలు, బీల్ఒలతో కలిసి కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారాల ప్రాధాన్యతను వివరించి, ప్రతి అర్హులైన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటరు నమోదు, వివరాల సవరణ అత్యంత కీలకమని పేర్కొన్నారు.