7 August, 2026 | 3:25 PM

Breaking News

ఎరువుల యాప్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలి   •   పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఉద్యమ పోరాట ఫలితమే ఆరోగ్య శ్రీ పథకం   •   అలుగుపడిన ఇల్లందులపాడు చెరువు.. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు   •   చేనేత కార్మికులకు అండగా నిలుస్తాం   •   వాట్సాప్‌లో MeeSeva సేవలు.. పేపర్‌లెస్ గవర్నెన్స్‌కు పెద్దపీట   •   ఆర్టీసీ తీర్థయాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజ్   •   హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలి: బీజేపీ ఆందోళన   •   విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పోచారం   •   నల్ల బ్యాడ్జీలతో రేజర్ల పాఠశాల ఉపాధ్యాయుల నిరసన   •   బాన్సువాడ మండలంలో 23 పూరి గుడిసెలను గుర్తించాం   •  

దళితులు ప్రతిఘటించాలి

07-08-2026 12:02 AM

దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు కృష్ణ స్వరూప్

ముషీరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): చుండూరు దళిత మృతవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం దళిత బహుజన పార్టీ (డీబీపీ) కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పాల్గొని అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1991 ఆగస్టు 6న చుండూరులో దళితులపై జరిగిన దాడి అత్యంత దారుణమైన ఘటనగా పేర్కొన్నారు.

చుండూరు ఘటనలో 11 మంది దళితులు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయని, అనంతరం ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిగినప్పటికీ, హైకోర్టు తీర్పుతో బాధితులకు న్యాయం జరగలేదని ఆరోపించారు. దళితులు తమ హక్కుల కోసం ప్రతి ఘటించాలని, రాజ్యాధికార సాధన ద్వారానే దళితులకు నిజమైన విముక్తి సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో డీబీపీ రాష్ట్ర కార్యదర్శి పి. మోహనరావు, డీ బీఎస్‌ఎఫ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ గణేష్, డీబీపీ గ్రేటర్ నాయకుడు స్వామిదాస్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేందరరావు, నాయకులు పాల్గొన్నారు.