బాన్సువాడ మండలంలో 23 పూరి గుడిసెలను గుర్తించాం
రెండవ రెండవ విడతలో కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ వెల్లడి
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఆయా గ్రామాల్లో పూరిగుడిసెలో నివాసం ఉంటున్న 23 మంది కుటుంబాలను గుర్తించమని బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ తెలిపారు. శుక్రవారం బాన్సువాడ ఎంపీడీవో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎంపీడీవో ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూరి గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకొని నివాసo ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. మండలంలో గుర్తించిన 23 మంది కుటుంబాలకు త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు రెండో విడతలో మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.అదేవిధంగా ప్రతి గ్రామంలో ఎవరైనా పూరిగుడిసెలో రేకుల ఇంట్లో నివాసం ఉంటున్న వారు తమ తమ గ్రామాల కార్యదర్శిలకు తెలుపగలరని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ భాను ప్రకాష్ ఉన్నారు.






