భారీ వర్షాల నేపథ్యంలోట్రాఫిక్ అడ్వైజరీ
అవసరమైతే తప్ప బయటకు రావద్దు.. పోలీసులు సూచన
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో మూడ్రోజులుగా కుండపోత వర్షం కురుస్తుంది. భారీ వర్షాల హెచ్చరికలతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు( Cyberabad Traffic Police) అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే పలు కీలక సూచనలు చేశారు. కంపెనీలు, సంస్థలు సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని కోరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద్యోగులకు విడతల వారీగా ముందస్తు లాకౌట్ కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లాకౌట్ సమయాన్ని ట్రాఫిక్ పోలీసులకు ఈమెయిల్ ద్వారా పంపాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా ముందస్తు చర్యలకు సహకరించాలని పోలీసులు కోరారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.






