30 May, 2026 | 10:49 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

కమిన్స్ వస్తున్నాడు

15-04-2026 01:11 AM

హైదరాబాద్, ఏప్రిల్ 14: రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రీఎంట్రీకి రంగం సిద్దమైంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న కమిన్స్.. జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు జట్టుతో కలిసిన కమి న్స్.. ఆ తర్వాత తిరిగిన ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.

బుధవారం అతనికి కికెట్ ఆస్ట్రేలియా ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ టెస్టులో కమిన్స్ నెగ్గితే ఈ నెల 17న భారత్‌కు వస్తాడని తెలిపింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఏప్రిల్ 21న ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో కమిన్స్ బరిలోకి దిగుతాడని పేర్కొం ది. యాషెస్ సిరీస్క్ ముందే గాయపడిన కమి న్స్.. కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉంటున్నాడు.

ఈ గాయంతోనే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి కూడా దూరమయ్యాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌కు ముందు జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొన్నాడు. తర్వాత సెకండాఫ్ సీజస్‌కు అందుబాటులో ఉంటానని తెలిపాడు. కమిన్స్ గైర్మాజరీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఇషాన్ కిషన్ నడిపిస్తున్నాడు. అతని సారథ్యంలో ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ 2 గెలిచి మూడింటిలో ఓడింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 57 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది.