29 July, 2026 | 9:56 PM

Breaking News

బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •  

మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ

08-06-2026 12:46 AM

కొమురవెల్లి, జూన్ 7 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. త్వరలో స్కూళ్ల కు సెలవులు ముగియనున్న నేపథ్యంలో  మల్లన్న సన్నిధానానికి భారీగా తరలివచ్చా రు.  శనివారం నుంచి మొదలైన భక్తుల రాక ఆదివారం మధ్యాహ్నం వరకు కొనసాగింది.

మల్లన్న సన్నిధానం చేరుకున్న భక్తులు స్వామివారి పుష్కరణిలో పుణ్యస్నానాలు ఆ చరించి, గర్భాలయంలో ఉన్న మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవి ధంగా గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు నివేదించి, ఒడి బియ్యం పోసి, తల్లిని భక్తితో వేడుకున్నారు. స్వామివారి ధర్మ దర్శనానికి సుమారు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి కృష్ణ తెలిపారు.