6 March, 2026 | 5:26 PM

జిల్లాలో బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు

06-03-2026 01:20 AM

పెండింగ్ సిఎంఆర్ రైస్ బకాయిలపై రైస్ మిల్లర్లతో సమీక్షలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి మార్చి 5(విజయక్రాంతి) జిల్లాలో బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెచ్చరించారు.గురువారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పెండింగ్ సిఎంఆర్ రైస్ బకాయిల పై డిసిపి రాం రెడ్డి, అదనపు కలెక్టర్ డి.వేణ తో కలిసి సంబంధిత రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావే శంలోజిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  అనేక సార్లు గడువు ఇచ్చినప్పటికీ సిఎంఆర్ లక్ష్యం మేరకు బియ్యం ఇవ్వని రైస్ మిల్లర్లకు విధించిన జరిమానా రుసుము శనివారం నాటికి చెల్లించాలని లేనిపక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని,ఖరీఫ్ ,రబీ సీజన్ సంబంధించి రికార్డుల మీద ఉన్న ధాన్యం మిల్లులు లో కనిపించడం లేదని,

దీనికి సంబంధించి మిల్లర్ల నుంచి ధాన్యానికి సంబంధించిన బకాయిలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. బకాయిలు చెల్లించని మిల్లర్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు బ్లాక్ లిస్టులో పెడతామని కలెక్టర్ హెచ్చరించారు.డిఫాల్టర్లుగా గుర్తించడం విలువలకు సంబంధించి ఓనర్లు, డైరెక్టర్, లీజు దారులు, కుటుంబ సభ్యుల ఆస్తులపై లావాదేవీలు జరగకుండా కట్టడి చేస్తామని,డిసిపి రాంరెడ్డి మాట్లాడుతూ రైస్ మిల్లర్లు డిఫాల్టర్లుగా మారితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని, అన వసరంగా జైలు కు వెళ్ళాల్సి వస్తుందని, అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా బకాయిలు సకాలంలో చెల్లించాలన్నారు.ఈ సమావేశంలో పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, ఎసిపి రమేష్ పౌరస రఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.