24 June, 2026 | 12:16 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

నాటుసారా తయారీపై ఉక్కుపాదం

23-06-2026 12:29 AM

10 ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ల పరిధుల్లో అబ్కారీశాఖ ప్రత్యేక దాడులు

ఎన్డీపీఎల్, డ్రగ్స్, గంజాయిపై తనిఖీలు ముమ్మరం

10 రోజుల్లో 841 కేసులు.. 651 మంది అరెస్టు

వేలాది లీటర్ల గుడుంబా, బెల్లం పానకం స్వాధీనం.. 119 వాహనాలు సీజ్ 

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): నాటు సారాను అరికట్టేందుకు అబ్కారీశాఖ ఉక్కుపాదం మోపుతోంది. ప్రత్యేకదాడులతో కొరడా ఝుళిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ల పరిధుల్లో 10 రోజుల్లోనే 841 కేసులు నమోదు చేసి, 651 మందిని అరెస్టు చేసింది. 3,191 లీటర్ల నాటు సారాను, 64,435 లీటర్ల బెల్లం పానకం, 8,377 కేజీల బెల్లాన్ని ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టుకున్నారు. 119 వాహనాలను సీజ్ చేశారు.

ఎక్సైజ్ శాఖ రెవెన్యూపై నేరుగా ప్రభావం చూపుతున్న నాటు సారాపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రఘనందన్ రావు, కమిషనర్ హరికిరణ్ అదేశించారు. దీంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవినాశ్ మహంతి ఎన్డీపీ ఎల్, డ్రగ్స్, గంజాయిపై దాడులు.. తనిఖీలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ నెల 12 తేదీ నుంచి 21వ తేదీ వరకు పది ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ల పరిధుల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.

ప్రత్యేదాడులు నిర్వహిస్తూ.. తనిఖీల చేసి, మం చి ఫలితాలను సాధించారు. వరంగల్ డిప్యూ టి కమిషనర్ పరిధిలో గుడుంబాపై 260 కేసులు నమోదు చేసి 206 మందిని అరెస్టు చేశారు. 1,400 లీటర్ల నాటు సారాను స్వాధీ నం చేసుకున్నారు. కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ పరిధిలో గుడుంబాపై 108 కేసులు నమోదు చేసి 76 మందిని అరెస్టు చేశారు.

310 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ డిప్యూటీ కమిషనర్ పరిధిలో 86 కేసులు నమోదు చేసి, 58 మందిని అరెస్టు చేయడంతో పాటు 260 లీటర్ల నాటుసారాను పట్టుకున్నట్లు అబ్కారీశాఖ అధికా రులు తెలిపారు. ఇక అదిలాబాద్ డిప్యూటీ కమిషనర్ పరిధిలో 80 కేసులు నమోదు చేసి, 76 మందిని అరెస్టు చేశారు. 298 లీటర్ల నాటు సారాను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఇక నాటు సారాతోపాటు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను భారీగానే పట్టుకున్నారు.

362.72 లీటర్ల నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పరిధిలో 206.56 లీటర్ల మద్యం, హైదరాబాద్ డీసీ పరిధిలో 66 లీటర్లు, మెదక్ డీసీ పరిధిలో 49.32 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. వీటితో 114.32 కిలోల గంజాయి, 41 గ్రాముల ఎండీఎంఎ, 310 గ్రాముల కోకైన్, 6.3 గ్రాముల హెరాయిన్‌ను పట్టుకున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో మొత్తం 64,435 లీటర్ల బెల్లం పానకం, 8,377 కేజీల బెల్లాన్ని ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టుకున్నారు.