9 August, 2026 | 5:08 PM

సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు చెయ్యాలి

09-08-2026 03:35 PM

తపస్  జిల్లా అధ్యక్షులు దత్తాత్రి

నారాయణఖేడ్, ఆగస్టు 8: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం  (TPUS) నారాయణ ఖేడ్ డివిజన్ సమావేశం స్థానిక శిశుమందిర్ లో ఆదివారం నిర్వహించారు.  ఈ సందర్భంగా  తపస్ జిల్లా అధ్యక్షులు దత్తాత్రి మాట్లాడుతూ... ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని, PRC వెంటనే ప్రకటించి, DA బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ,ముఖ్య మంత్రి గారి ప్రధాన ఎన్నికల హామీని CPS రద్దును పూర్తిగా మర్చిపోయారని అన్నారు.

ప్రి ప్రైమరీ బడులల్లో కొత్త నియామకాలు పూర్తి చేయాలని కోరారు. లేదంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ వేత్త ఇప్పటి వరకు 20 వేల మొక్కలు స్వయంగా నాటి మంజీరా పరివాహక ప్రాంతంలో మొక్కలు నాటుతూ ప్లాస్టిక్ తొలిగిస్తున్న మన ప్రాంత వాసి జ్ఞానేశ్వర్  ను TPUS ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసారు. కార్యక్రమంలో రాష్ట్ర సేవ కో కన్వీనర్ చంద్రశేఖర్ ఆచార్య ,జిల్లా గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్,జిల్లా బాధ్యులు వినయ్,రాజయ్య, రాజశేఖర్,ఇతర బాధ్యులు  రతన్ సింగ్, మచ్చందర్,మహేశ్,పద్మ నాభం, రాజు, జగదీశ్వర్, లు పాల్గొన్నారు.