18 July, 2026 | 2:18 AM

పోరాడితేనే హక్కులు వస్తాయి.. భిక్షగా రావు

18-07-2026 02:05 AM

ఇక మౌనం కాదు.. హక్కుల సాధనే లక్ష్యం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

మహబూబ్ నగర్ టౌన్ జూలై 18: పోరాడితేనే హక్కులు సాధించుకుంటామని బిక్షగా ఎప్పటికీ రావని.. లేనియెడల అణగదుకుతారని.. ఉద్యమానికి సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దళిత క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన క్రైస్తవ గర్జనకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ‘దళిత క్రైస్తవులంతా అధిక సంఖ్యలో తరలివచ్చి హక్కుల సాధన కోసం కదం తొక్కారు. ఈ గర్జన‘ సభ భారీ జనసమీకరణతో విజయవంతమైంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన దళిత క్రైస్తవులు సభా ప్రాంగణాన్ని కిక్కిరిసేలా చేశారు. నినాదాలతో మార్మోగిన సభలో హక్కుల సాధనే ప్రధాన అజెండాగా నిలిచింది.

సభలో ప్రసంగించిన జాన్ వెస్లీ, దళిత క్రైస్తవులకు న్యాయంగా రావాల్సిన హక్కులు, అవకాశాలు ఇప్పటికీ అందడం లేదని అన్నారు. ‘హక్కులు ఎవరూ దానం చేయరు.. పోరాడి సాధించుకోవాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇక మౌనం కాదు.. ఉద్యమమే మా మార్గం‘ అని ఎందుకు మీరంతా ఉప్పెనల్ల దండెత్తాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దళిత క్రైస్తవుల్ని ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేస్తారని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

ఈ దేశంలో క్రైస్తవులు స్థాపించిన విద్యాసంస్థల్లో చదువులు నేర్చుకున్న వారంతా క్రైస్తవులపై తిరుగుబాటుకు దిగడం సిగ్గుచేటు అన్నారు. మన దేశంలోని కీలక నాయకుల పిల్లలు క్రైస్తవ దేశాల్లో చదువుతూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కానీ ఇక్కడ మాత్రం మత రాజకీయాలు చేసి విడదీసి పాలిస్తున్నారు. ఇకనైనా దళిత క్రైస్తవుల సమస్యలపై ప్రభుత్వాలు వెంటనే స్పందించి న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే హక్కుల సాధన కోసం చేపట్టిన ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సభలో పాల్గొన్న ప్రజల భారీ హాజరు దళిత క్రైస్తవుల ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి వినోద్ కుమార్, జేఏసీ కన్వీనర్ కాశపోగు ప్రసాద్, పాస్టర్ అసోసియేషన్ నేతలు సుందర్ పాల్, బిఎస్ పరంజ్యోతి, పృథ్వీరాజ్,పాస్టర్ రవిందర్, కృష్ణపాల్, జికె. రూఫస్, కురుమూర్తి దేవదానం, శ్రీనివాస్ పీటర్, గట్టు డేవిడ్, పల్లెపాగ ప్రశాంత్, జిజి పౌలు, ఐజయ్య, వెంకటయ్య, సలహాదారులు యోనా సతీష్ , మిట్టు, అడ్డాకుల జగన్ లతో పాటు అధిక సంఖ్యలో దళిత క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.