8 April, 2026 | 6:47 PM

కన్నెపల్లి పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా

08-04-2026 04:48 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కన్నెపల్లి పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభోత్సవ నేపథ్యంలో నిర్మాణ పనులను సీపీ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి పనులను బుధవారం పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, ఆదేశించారు.పోలిస్టేషన్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తిచేసి,ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, తాండూర్ సీఐ దేవయ్య, బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్‌ఐ భాస్కర్ రావు ఉన్నారు.