8 April, 2026 | 7:20 PM

పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం

08-04-2026 05:37 PM

  మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్

దేవరకొండ,(విజయక్రాంతి): పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం.  మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్. అన్నారు. బుధవారం మైనంపల్లి గ్రామంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ మంచి పౌష్టికాహారం తీసుకోవాలని అదేవిధంగా చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

మనం ఉండే పరిసర ప్రాంతం పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఎలాంటి రోగాలు రావని అందరు కూడా పరిశుభ్రత పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్.యం ఎల్ హెచ్ పి స్వాతి. ఎ ఎన్ యం విజయ. వార్డు సభ్యులు పులిజాల నాగరాజు. పులిజలా సంతోష వెంకట్. కొర్ర లక్ష్మీ ప్రశాంత్. మూడవత్ దాసు నాయక్.ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి. జగదీష్. ఆశ కార్యకర్తలు అలివేలు.ఝాన్సీ. వెంకటమ్మా. తదితరులు పాల్గొన్నారు.