8 April, 2026 | 7:55 PM

బాన్సువాడ డిపో ఎదుట రిలే నిరాహార దీక్షలు

08-04-2026 06:09 PM

ఆర్టీసీ డిపో మేనేజర్ మొండి వైఖరికి నిరసనగా... 

రిలే దీక్షలు ప్రారంభించిన సీఐటీయూ జిల్లా నాయకులు రవీందర్

బాన్సువాడ, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోలో గత 25 రోజులుగా డ్రైవర్లు సాజిద్, రియాజ్ లను విధులకు పంపకుండా బలవంతంగా డ్రైవర్ కండక్టర్ విధులు నిర్వహించాలని బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్ తీవ్రమైనటువంటి ఒత్తిడిని సృష్టించారనీ ఆయన మొండి వైఖరికి నిరసనగా బుధవారం బాన్సువాడ ఆర్టీసీ డిపో ఎదుట రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. సిఐటియు జిల్లా నాయకులు రవీందర్ వారికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు రవీందర్ మాట్లాడుతూ డ్రైవర్లు సాజిద్, రియాజ్ లను విధులకు పంపకుండా బలవంతంగా డ్రైవర్ కండక్టర్ విధులు నిర్వహించాలని ఒత్తిడి చేయడం తమకు ఆంగ్లము రాదని కండక్టర్ పని మేము చేయలేమని వారు ఎంత మొత్తుకున్నా వినకుండా డ్రైవర్ విధులకు అనుమతించడం లేదు. దీంతో వారికి ఈనెల జీతంలో కోత విధించారు కాగా వారు ఇది అన్యాయమని డిపో ఎదుట ధర్నా నిర్వహించారు ధర్నా నిర్వహిస్తారా మీరు అని ఆ డ్రైవర్లకు చార్జీ షీట్ ను జారీ చేయడం జరిగింది . దీంతో చేసేదేమీ లేక వాళ్లు నేటి నుండి రిలే నిరాహార దీక్షకు దిగినారు.

నాలుగు రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేస్తామని అయినా యాజమాన్యం దిగిరాకపోతే కుటుంబ సభ్యులతో సహా ఆమరణ నిరాహార దీక్షను చేపడుతామని వారు తెలిపారు. ఈరోజు నిరాహార దీక్షలో డ్రైవర్ రియాజ్ ఎస్డబ్ల్యుఎఫ్ మాజీ రీజినల్ అధ్యక్షులు బి శంకర్ లు కూర్చున్నారు మద్దతుగా డిపో కార్మికులు ఇతర యూనియన్ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘం, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డి శంకర్ తదితరులు పాల్గొన్నారు.