7 July, 2026 | 1:10 PM

Breaking News

డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపుకు ప్రజలు సహకరించాలి

07-07-2026 12:18 PM

వర్షాకాలం దృష్ట్యా మురికి నీరు రోడ్లపై పారకుండా చర్యలు...

రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్...

బాన్సువాడ, జూలై 7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న ప్రధాన డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణ తొలగించడం జరుగుతుందని ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ కోరారు. మంగళవారం కాసుల బాలరాజ్ తో పాటు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, 13వ వార్డు కౌన్సిలర్ ఖాలేక్ లు పట్టణంలోని డ్రైనేజీలపై ఆక్రమాలు చేసిన వ్యాపారస్తులతో మాట్లాడి వెంటనే తొలగించాలని సహకరించాలని వారు కోరారు.

ఈ సందర్భంగా కాసుల బాలరాజ్ మాట్లాడుతూ వ్యాపారస్తులు డ్రైనేజీలపై ఆక్రమాలు చేయడంతో వర్షాకాలంలో మురికి నీరు డ్రైనేజీలో పేరుకపోవడంతో రోడ్లపై మురికి నీరు పారడంతో ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బందులు గురవుతున్న దృశ్య డ్రైనేజీలపై ఏర్పాటు చేసిన ఆక్రములను తొలగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గత కొన్ని రోజుల క్రితమే వ్యాపారస్తులకు ముందస్తు సమాచారం ఇచ్చామని ఇప్పటికీ డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని మున్సిపల్ ఆధ్వర్యంలో డ్రైనేజీలపై ఆక్రమణ జెసిబి సహాయంతో తొలగించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

బాన్సువాడ పట్టణ సుందరీకరణ లో భాగంగా డ్రైనేజీలు వెంటనే శుభ్రం చేసి మురికి నీరు చెత్తాచెదారం డ్రైనేజీలో నిండకుండా రోడ్లపై మురికినీరు పారకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని బాన్సువాడ పట్టణ సుందరీకరణకు ప్రజలందరూ వ్యాపారస్తులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.