27 April, 2026 | 8:49 PM

అంబరాన్నంటిన బిఆర్ఎస్ ఆవిర్భావ సంబరాలు

27-04-2026 07:04 PM

పాల్వంచ,(విజయక్రాంతి): భారతీయ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాలు సోమవారం పాత పాల్వంచలోని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం  ఇంచార్జి వనమా ఆధ్వర్యంలో  పార్టీ జెండాలను ఆవిష్కరించి, కేక్ కటింగ్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో మన కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడమే మన ధ్యేయంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ సాధన చరిత్రలో  దేశానికే రోల్ మోడల్ అన్నారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళీ కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం తథ్యం అన్నారు. మే నుండి కెసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ దూసుకపోవడం ఖాయమన్నారు.