22 June, 2026 | 12:14 PM

తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

22-06-2026 10:48 AM

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో విషాదం

బోధన్,జూన్ 22(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో(Bodhan Mandal) విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. బోధన్ మండలంలోని ఊట్పల్లిలో మెయిన్ విద్యుత్ వైర్ తగిలి ఇంటికి కరెంట్ సరఫరా కావడంతో బట్టలు ఆరవేస్తుండగా రత్నావత్ జ్యోతి(41)కి షాక్ తగిలింది. ఆమెను రక్షించే క్రమంలో భర్త సంజీవ్ (45), ముగ్గురు పిల్లలకు కూడా విద్యుత్ షాక్కు గురయ్యారు. ఇది రాత్రి సమయంలో జరిగింది తీవ్రంగా గాయపడిన దంపతులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, పిల్లలు గాయాలతో బయటపడ్డారు.