21 June, 2026 | 7:02 PM

ఆరోగ్య సమస్యలతో నవ వధువు మృతి

21-06-2026 05:05 PM

సుతార్ పల్లిలో ఘటన

40 రోజుల క్రితమే వివాహం

రామాయంపేట,(విజయకాంతి): నలభై రోజుల క్రితం వివాహమైన ఓ వధువు నవ వధువు ఆరోగ్య సమస్యలతో శనివారం అర్ధరాత్రి ప్రాణాలు వదిలింది.వివరాలు.. రామాయంపేట మండల పరిధి సుతార్ పల్లి గ్రామానికి చెందిన నిఖిల్ తో చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన అర్చన( 25) పెళ్లి జరిగింది.

కడుపులో నొప్పి రావడంతో ఈ ఉదయం అర్చనకు తీవ్ర జ్వరం రావడంతో పలు ప్రైవేట్ ఆసుపత్రిలో అత్తింటి వారు చూపించారు. అయినా తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలను కోల్పోయింది.దీంతో మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై బాలరాజ్ ఆదివారం కుటుంబీకుల నుంచి వివరాలు సేకరించారు. అయితే ఎలాంటి ఫిర్యాదు చేయని కారణంగా కేసు నమోదు కాలేదు.