19 April, 2026 | 7:31 AM

కంట్రీక్లబ్ మాస్టర్ కార్డ్ ప్రకటన

19-04-2026 12:11 AM
  1. ఫుకెట్ థీమ్‌తో ఫ్యాషన్ షో

బ్యాంకాక్, పట్టాయా, ఫుకెట్ల ప్రయాణానికి అవకాశం

సంస్థ చైర్మన్ వై.రాజీవ్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): కంట్రీ క్లబ్ తమ ప్రత్యేక థాయిలాండ్ మాస్టర్ కార్డ్‌ను ప్రకటించింది. ఈ ప్రీమియం మెంబర్‌షిప్ ద్వారా థాయిలాండ్‌లోని ప్రముఖ పర్యాటక నగరాలైన బ్యాంకాక్, పట్టాయా, ఫుకెట్లకు సులభంగా, ప్రణాళికాబద్ధంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ కార్డును శనివారం హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.రాజీవ్‌రెడ్డి థాయిలాండ్ మాస్టర్ కార్డ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ ఇమ్రాన్‌ఖాన్, ఫుకెట్ థీమ్‌తో నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అందాల ముద్దుగుమ్మలు ఇండో-వెస్ట్రన్, వేర్ కలెక్షన్స్‌లో వయ్యారాల నడకలతో హొయలొలికించారు. ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ పర్యటన మరింత సులభంగా ఉండేందుకు, ఫ్రాంచైజీ ఆధారిత విస్తరణ వ్యూ హం ద్వారా సభ్యులకు సులభమైన ప్రయా ణం అందించడమే లక్ష్యంగా పని చేస్తోందన్నా రు. తమక్లబ్ ఇప్పటికే బ్యాంకాక్, పట్టాయాలో భాగస్వామ్యాంతో విస్తరణ పెంచుకున్నదన్నారు.

ఇప్పుడు ఫుకెట్‌ను చేర్చడం ద్వారా సభ్యులకు లగ్జరీ, అడ్వెంచర్, హాస్పిటాలిటీ కలగలిపిన సమగ్ర అనుభవాన్ని అందించను న్నట్లు వివరించారు. ప్రస్తుతం పర్యాటక రం గం ప్రపంచ ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక మార్పి డి, జీవనశైలి అభివృద్ధికి కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ, లైఫ్ స్టయిల్‌ల, గ్లోబల్ మొబిలిటీ రంగాల కలయికలో తన స్థానాన్ని బలపరుచుకుంటోం దని రాజీవ్‌రెడ్డి స్పష్టం చేశారు.