calender_icon.png 15 February, 2026 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా మున్సిపల్ ఓట్ల లెక్కింపు

14-02-2026 12:00:00 AM

చైర్మెన్ పీఠానికి స్వతంత్రులే కీలకం

కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 13( విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేపట్టిన మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగింది శుక్రవారం ఉదయం 8గంటలనుండే ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు ,ఇరవై వార్డ్ లను రెండు రౌండ్ లుగా విభజించి మొదటి రౌండ్ లో 10,రెండవ రౌండ్ లో 10 వార్డులుగా ఓట్లను లెక్కించారు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించి,అనంతరం బ్యాలెట్ పత్రాలను లెక్కించారు,కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కే హరిత,అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారిలు దగ్గర ఉండి పరిశీలించారు.

కౌం టింగ్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ ఓట్ల లెక్కింపులో ఒకటవ వార్డు నుండి జాడి వినోద్(284) ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి, రెండవ వార్డు నుండి వైరగడే గోవింద్ (195)ఓట్లతో స్వతం త్ర అభ్యర్థి, మూడో వార్డ్ నుండి మెంగ్రే ఆకాష్ (198) ఓట్లతో బీఅర్‌ఎస్ అభ్యర్థి, నాలగవ వార్డ్ నుంచి బాలకృష్ణ (215) ఓట్లతో బీఅర్‌ఎస్ అభ్యర్థి, ఐదవ వార్డ్ నుండి స్వప్న రాణి (286) ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి, ఆరవ వార్డ్ నుండి చిలివేరు వెంకన్న (264) ఓట్లతో బీఅర్‌ఎస్ అభ్యర్థి, ఏడవ వార్డ్ నుండి తనకు భార్గవి (223) ఓట్లతో బీఅర్‌ఎస్ అభ్యర్థి, ఎనిమిదవ వార్డ్ నుండి లోనారే తార బాయి (194)ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి, తొమ్మిదవ వార్డు నుండి సలాం బిన్ అహ్మద్ (193) ఓట్లతో బీఅర్‌ఎస్ అభ్యర్థి, పదో వార్డ్ నుండి కామ్రే భాగ్యలక్ష్మి (146) ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి, పదకొండు వార్డ్ నుండి రాపర్తి కార్తీక్ (265) ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి, ౧౨ వార్డ్ నుండి ఆత్రం కృష్ణ మ్మ (215) ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి, ౧౩వ వార్డు నుండి గుండా స్నేహ (234)ఓట్ల తో కాంగ్రెస్ అభ్యర్థి, ౧౪వ వార్డ్ నుంచి కొండు భారతి (217)ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి, ౧౫వ వార్డ్ నుండి అబ్దుల్లా (278) ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి, ౧౬వ వార్డ్ నుండి దూడల లక్ష్మీ (316) ఓట్లతో బీఅర్‌ఎస్ అభ్యర్థి, ౧౭వ వార్డ్ నుండి ఏం డి అహ్మద్ (278)ఓట్లతో బీఅర్‌ఎస్ అభ్యర్థి, ౧౮వ వార్డు నుండి కస్తూరి పుష్పలత (169) ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి, ౧౯వ వార్డ్ నుండి గుబుడే నాగబాయి (228) ఓట్లతో బీఅర్‌ఎస్ అభ్యర్థి, ౨౦వ వార్డ్ నుండి జైబ్ షేక్ (191) ఓట్లతో బీఅర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. వీరికి రిటర్నింగ్ అధికారి గెలుపొ ందిన పత్రాలను అందచేశారు.