కేఎల్ వర్సిటీలో ప్రవేశాలకు కౌన్సిలింగ్
నేటినుంచి ఈనెల 30వ తేదీ వరకు నిర్వహణ
విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్‌లలో..
ఇంజనీరింగ్ పాటు అన్ని కోర్సులకు కౌన్సిలింగ్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్‌లలో ఇంజనీరింగ్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి ఆదివారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ పార్ధసారధి వర్మ వెల్లడించారు.
కేఎల్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థులతో పాటు జేఈఈ పర్సెంటైల్, ఇంటర్ మార్కుల ఆధారంగా కూడా కౌన్సిలింగ్‌లో పాల్గొని విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు ఎంచుకోవచ్చని చెప్పారు. కౌన్సిలింగ్‌లో పాల్గొనే మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్ సదుపాయం ఉంటుందని ఆయన చెప్పా రు. యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు మాట్లాడుతూ కౌన్సిలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, మెరిట్ విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చేలా స్కాలర్‌షిప్ ప్రణా ళిక రూపొందించామని చెప్పారు.కౌన్సిలింగ్ సంబంధిత పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని ఆయన చెప్పారు.






