1 September, 2026 | 11:12 AM

అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం

01-09-2026 10:12 AM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): బెల్లంపల్లి మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి, పండుగల ఏర్పాట్లకు సంబంధించిన 14 అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. రోడ్ల విస్తరణకు విద్యుత్ స్తంభాల తొలగింపు, వీధి దీపాల మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, కార్యాలయ మౌలిక వసతుల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. వినాయక నిమజ్జనం, బతుకమ్మ, దసరా ఏర్పాట్లకు కూడా నిధులు మంజూరు చేశారు. సమావేశానికి మున్సిపల్ చైర్‌పర్సన్ దావస్వాతి అధ్యక్షత వహించగా కమిషనర్ తన్నీరు రమేష్, వైస్ చైర్మన్ సత్యనారాయణ, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.