1 September, 2026 | 10:49 AM

పాముకాటుతో వ్యక్తి మృతి

01-09-2026 09:55 AM

బెజ్జూర్ ఆగస్టు 31 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండలం కుకుడా గ్రామంలో పాముకాటుతో పూరేతేటి బాబు మృతి చెందాడు. ఇంటి వద్ద గడ్డి తీస్తుండగా దాగి ఉన్న గుర్తుతెలియని పాము కాటువేసింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.