1 September, 2026 | 11:31 AM

మత్తు పదార్థాలు సేవిస్తే నిమిషాల్లోనే గుర్తింపు

01-09-2026 11:11 AM

మత్తు పదార్థాలు సేవిస్తే నిమిషాల్లోనే గుర్తింపు

రాపిడ్ టెస్ట్ కిట్లతో యువకులపై ప్రత్యేక నిఘా

స్వచ్ఛందంగా ముందుకు వస్తే డీ-అడిక్షన్ కేంద్రానికి పంపిస్తాం

కొయ్యూరు ఎస్ఐ మహేందర్ కుమార్ యాదవ్

కొయ్యూరు, సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి): కొయ్యూరు మండలంలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు రాపిడ్ టెస్ట్ కిట్లతో ప్రత్యేక నిఘా చేపట్టారు. అనుమానంతో పరీక్షలు నిర్వహించగా ఇద్దరు యువకులకు పాజిటివ్‌గా తేలడంతో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. మత్తు పదార్థాలకు బానిసైన వారు స్వచ్ఛందంగా పోలీసులను సంప్రదిస్తే డీ-అడిక్షన్ కేంద్రాలకు పంపించి చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ మహేందర్ కుమార్ యాదవ్ తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం, రవాణా, నిల్వ, వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.