వియత్నాంలో ఘోరప్రమాదం.. భారతీయ టూరిస్ట్ పడవ బోల్తా
ఫు క్వాక్ ద్వీపం: వియత్నాంలోని ఫు క్యూక్ ద్వీపం(Phu Quoc) సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. భారతీయ టూరిస్టు బోటు మునిగిపోయింది. మొబైల్ కంపెనీ బిజినెస్ ట్రిప్(Mobile Company Business Trip) కు వెళ్లిన వారికి ప్రమాదం జరిగింది. మొబైల్ కంపెనీ తరుఫున బృందం భారత్ నుంచి వియత్నాంకు వెళ్లింది. కంపెనీ 250 మంది డిస్ట్రిబ్యూటర్లను వియత్నాం తీసుకుపోయింది. 35 మంది ఏపీ, 40 మంది తెలంగాణ, కడప, బందరుకు చెందిన మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు.
వియత్నాంలో 3 బూట్లలో 250 మంది డిస్ట్రిబ్యూటర్లు విహారయాత్రకు వెళ్లారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఒక బోటు మునిగిపోయింది. మునిగిపోయిన బోటులో 70 మందికిపైగా మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వాతావరణ సరిగా లేకపోవడం వల్లే బోటు మునిగిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర అస్వస్థత, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 70 మంది పర్యాటకులు ఐసీయూలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యల ఆలస్యంతో పర్యాటకుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై బాధితులు తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ బోటు ప్రమాదంలో 19 మంది మరణించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.






