ఊట్కూరి రవీందర్ రెడ్డికి అభినందనలు
ముకరంపుర,(విజయక్రాంతి): ఆల్పోర్స్ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలకు జాతీయ స్థాయి "బెస్ట్ ప్లేస్‌మెంట్ అండ్ కెరీర్ డెవలప్‌మెంట్ ఎడ్యుకేషన్ ఐకాన్ అవార్డు-2026" లభించడం పట్ల జిల్లా బీసీ సంఘ సభ్యులు దొగ్గలి శ్రీధర్, మాదాసు సంజీవ్, కుసుంబ ఆదర్శ్ లు ఆల్ ఫోర్స్ డిగ్రీ కళాశాల అధినేత ఊట్కూరి రవీందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం, నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా, వారికి అద్భుతమైన ఉద్యోగ మరియు కెరీర్ అవకాశాలను కల్పిస్తూ మీరు చేస్తున్న కృషికి ఇది ఒక గొప్ప గుర్తింపు. మీ నాయకత్వంలో కళాశాల మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, విద్యా రంగంలో మరెన్నో అద్భుతమైన విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.






