13 April, 2026 | 11:15 PM

కార్పోరేటర్ కమర్తపు మురళీకి మాతృవియోగం

13-04-2026 09:35 PM

నివాళ్ళు అర్పించిన మంత్రి తుమ్మల, కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఖమ్మం,(విజయక్రాంతి): రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు, 24వ డివిజన్ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కమర్తపు మురళీకి సోమవారం మాతృ వియోగం జరిగింది. ఆయన తల్లి బతుకమ్మ తెల్లవారుజామున స్వర్గస్తులైయ్యారు.ఈ  విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఖమ్మం మేయర్ పూనకల్లు నీరజ, పీసీసీ సభ్యులు ఎండీ. జావిద్, తదితరులు వారి స్వగృహం శ్రీరాం హిల్స్ లో పార్థివదేహానికి వెళ్ళి నివాళులు అర్పించారు. మురళీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.