22 July, 2026 | 2:04 AM

రహదారి ప్రమాదాల నివారణకు సమన్వయంతో కృషి చేయాలి

22-07-2026 01:23 AM

కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల, జూలై 21 ( విజయక్రాంతి ) : రహదారి ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జాతీయ రహదారులపై పెట్రోలింగ్, బ్లాక్ స్పాట్ల వద్ద భద్రతా చర్యలు, రోడ్ల ఆక్రమణల తొలగింపు, జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీలు, హైవే సేఫ్టీ టాస్క్ ఫోర్స్ను చురుకుగా పనిచేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైవే ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి, రహదారి భద్రతపై చేపడుతున్న చర్యలపై ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.