మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
ముకరంపుర,(విజయక్రాంతి): బిజెపి పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్రెడ్డి రేకుర్తి ఐ హాస్పిటల్ బైపాస్ రోడ్డు మధ్యలో మొక్కలు నాటారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ప్రతి బూతులో రెండు మొక్కలు నాటే కార్యక్రమం రేకుర్తి 40వ బూత్ అధ్యక్షుడు ఏం లక్ష్మి రాజ్యం ఆధ్వర్యంలో జోన్ కన్వీనర్ జాడి బాల్రెడ్డి బిజెపి నాయకులు బుద్ధ శ్రీనివాస్ హాజరై మొక్కలు నాటారు.
అనంతరం జాడి బాల్రెడ్డి మాట్లాడుతూ... పశ్చిమ జోన్ 60 బూతుల అధ్యక్షులు బిఎల్ఎలు వారి బూతు పరిధి కాలనీలో మొక్కలు నాటారని , మొక్కల పెంపకం వలన పర్యావరణాన్ని కాపాడుదామని, వర్షాలు కురవడం కాలుష్యాన్ని నియంత్రణ అలాగే మానవులు పీల్చుకునే గాలి కాలుష్య రహితంగా ఉంటుందని అన్నారు. నరేంద్ర మోడీ పర్యావరణం పైన ప్రత్యేక దిష్టిపెట్టారని కావున మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షించుదాం అన్నారు. కార్యక్రమంలో భూత్ అధ్యక్షులు గోదారి నరేష్, ముసవాడ రాహుల్, బండి రాకేష్ ,తదితరులు పాల్గొన్నారు.






