కన్సల్టెన్సీ మేనేజర్ దారుణ హత్య!
జూబ్లీహిల్స్, మార్చి 10 (విజయక్రాంతి): నగరంలోని మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్వల్ప నగదు వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బంజారా హిల్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకా రం పిల్లర్ నంబర్ 1482 సమీపంలోని వారాహి కన్సల్టెన్సీలో శశికిరణ్ రెడ్డి మేనేజర్గా పని చేసేవాడు.కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి ఉద్యోగం కోసం అతని వద్దకు వచ్చి కన్సల్టెన్సీ ఫీజుగా రూ.2.500లు చెల్లించగా ఓ జాబ్ లో పెట్టించాడు.జాబ్ నచ్చకపోవడంతో సదరు వ్యక్తి తాను చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వమని కోరగా శశి కిరణ్ రూ. 1500లు ఇచ్చి పంపించాడు.
మిగతా వెయ్యి రూపాయల కోసం మంగళవారం మధ్యా హ్నం శశి కిరణ్ అఫిస్‌కు వచ్చి మిగత రూ. 1000లు ఇవ్వాల్సిందేనని అడిగాడు, ఈ విషయంలో ఇరువురికి మాట మాట పెరిగి గోడవపడ్డారు.దీంతో తనకు రావాల్సిన 1000 రూపాయలు తిరిగి ఇవ్వలేదన్న కోపంతో పదునైన ఆయుధం తో విచక్షణారహితంగా దాడి చేశాడు.నిందితుడు శశికిర ణ్ మెడపై బలంగా పొడవడంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్యో గంలో చేర్పించినందుకు ఇచ్చిన డబ్బుల విషయంలో వివాదం కారణంగా ఈ ఘటన జరిగిందని అనుమానాలున్నాయి.
ఈ ఘోర కలిని తన మొబైల్లో చిత్రీకరిస్తోందన్న ఆగ్రహంతో, నిందితుడు అక్కడే ఉన్న లయ అనే మహిళపై కూడా దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు.ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు.




