11 March, 2026 | 10:32 AM

గిరిజన అధ్యయనాలపై సర్టిఫికేట్ కోర్సు

11-03-2026 01:16 AM

మంచిర్యాల టౌన్, మార్చి 10: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ట్రైబల్ స్టడీస్’ను ఈ నెల 16 నుంచి ప్రారంభించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జై కిషన్ ఓజా తెలిపారు. మంగళవారం కళాశాలలో కోర్సు పోస్టర్లను ఆవిష్కరించిన అనం తరం ఆయన మాట్లాడారు. గిరిజన అధ్యయనాలపై ఆసక్తి ఉన్న వారికి ఈ కోర్సు ఉప యోగకరంగా ఉంటుందన్నారు.

డిగ్రీ చదువుతున్న విద్యార్థులతో పాటు డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులని, ఆసక్తి గల అభ్యర్థులు త్వరగా నమోదు చేసుకోవాలని కోరా రు. ఆఫ్లైన్, ఆన్లైన్ (హైబ్రిడ్) విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. స్పెషల్ కోర్సు కో సం ఈ నెల 16 వరకు ప్రవేశాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నరేందర్ రెడ్డి, ఆర్థిక శాస్త్ర విభాగం అధ్యాపకులు, కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.గోపాల్‌కృష్ణ, అధ్యాపకులు డాక్టర్ కే.రాజయ్య, ఎం. కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.