ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం
3వ వార్డు కౌన్సిలర్ ఎం. ఏ హకీమ్
బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి తాగునీటి ఎద్దడి లేకుండా అమృత్ స్కీం ద్వారా వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే పట్టణంలోని 3వ వార్డు ఇస్లాంపుర కాలనీలో కౌన్సిలర్ ఎం.ఏ హకీమ్ చేతుల మీదుగా వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హకీమ్ మాట్లాడుతూ... అమృత్ 2.0 స్కీం ద్వారా ఇస్లాంపుర కాలనీకి 14 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ మంజూర అయిందని నిర్మాణానికి భూమి పూజ చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. కాలనీవాసుల తాగునీటి సమస్య లేకుండా వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన అన్నారు. ఈ వాటర్ ట్యాంక్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.






