24 July, 2026 | 4:00 PM

ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మించుకోండి

24-07-2026 02:55 PM

బోథ్,(విజయక్రాంతి): ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఫలితంగా భూగర్భ జలాలు పెరుగుతాయని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గన్ పూర్ డివిటి గ్రామాలలో గ్రామస్తులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వర్షాభావ పరిస్థితుల వల్ల సమీప భవిష్యత్తులో నీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినట్లయితే బోరు బావుల లో నీటిమట్టం తగ్గకుండా ఉంటుందన్నారు.

ప్రభుత్వం మంజూరు చేసిన చెక్ డ్యాములు చిన్నచిన్న చెరువులను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. వృధాగా పోయే నీటిని భూమిలో ఇంకే విధంగా చూడాలన్నారు. ఆయా గ్రామాలలో న్యూట్రి గార్డెన్ లో మునగ మొక్కలను నాటారు.ఆయా పాఠశాలలో పారిశుధ్యం పనులను పర్యవేక్షించారు. సమావేశంలో ఆయా గ్రామాల ప్రజలతో పాటు సర్పంచులు గ్రామాల కార్యదర్శి లు పాల్గొన్నారు.