కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రేవంత్
కేరళ, అస్సాం, పుదుచ్చేరితో పాటు గోవాలోని పోండా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయనున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్, మార్చి 27 (విజయ క్రాం తి): దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక లు, వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిప క్ష నేత రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు 40 మంది సీనియర్‌లతో స్టార్ క్యాంపెయినర్ జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
ఈ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఏఐసీసీ నియమించింది. కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేయను న్నారు. వీటితో పాటు గోవా రాష్ట్రంలోని పోండా నియోజక వర్గానికి జరగనున్న ఉప ఎన్నికలోనూ ఆయన స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేయనున్నారు.




